హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కోసం పోలీసుల కాళ్లు పట్టుకున్న అభ్యర్థులు!

పల్నాడు జిల్లా నరసరావుపేటలో తమకు నామినేషన్ వేసే అవకాశం కల్పించాలని కోరుతూ మొలకలూరు గ్రామస్తులు, అభ్యర్థులు ఇసప్పాలెంలో ఆందోళనకు దిగారు. నరసరావుపేట మండలంలోని ఇసప్పాలెం వద్ద రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. నామినేషన్ దాఖలుకు అనుమతించాలంటూ పోలీసుల కాళ్లు పట్టుకుని, దండాలు పెడుతూ అభ్యర్థులు వేడుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.