హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అప్పన్న స్వామి అన్నదానానికి భారీ విరాళం

VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న అన్నదానానికి భారీ విరాళం అందజేశారు. దాతల దాతృత్వాన్ని ఈవో అభినందించారు. 12వ వార్డు విశాలాక్షి నగర్ కు చెందిన బుచ్చి బాబు కుమార్తె వర్షిణి రూ.5,32,000 చెక్కును అన్నదానం నిమిత్తం ఆలయ ఈవో వెంకట రావుకు అందజేశారు. ఆలయ సిబ్బంది ఆ కుటుంబానికి స్వామి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు.