హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప ప్రాజెక్టుల్లో తగ్గుతున్న నీటి నిల్వలు

కడప జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి 143 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తుండగా, సాగు, తాగునీటి అవసరాల కోసం 1,576 క్యూసెక్కులు బయటకు వెళ్తున్నాయి. ఇన్‌ఫ్లో కంటే ఔట్‌ఫ్లో అధికంగా ఉండటంతో ప్రస్తుతం 34.654 టీఎంసీల (42.15%) నీటి నిల్వలున్నాయి. వర్షాలు కురవకపోతే నిల్వలు మరింత తగ్గే ప్రమాదం ఉండటంతో రబీ సాగుకు సిద్ధమవుతున్న రైతుల్లో ఆందోళన నెలకొంది.