హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్లలో నాయకుల మధ్య ఘర్షణ

అన్నమయ్య: రామాపురం మండలంలో పంచాయతీ సర్పంచ్ల నామినేషన్ల ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. గ్రామాల్లో టీడీపీ, వైసీపీ అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మండలంలోని హసనాపురం గ్రామ సర్పంచ్ స్థానానికి నామినేషన్లు వేసే ప్రక్రియలో ఇరు పార్టీ నాయకులు ఘర్షణకు దిగారు. సర్పంచ్ అభ్యర్థితో పాటు మరికొందరు గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనలో ఓ కారు ధ్వంసం అయింది.