హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సిద్ధాంతంలో తొలి నామినేషన్

WG: పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో కూటమి బలపరిచిన అభ్యర్థి కడలి హిమావతి తొలి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన వెంటనే ఆమె ఎన్నికల అధికారులకు పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన వెన్నంటి ప్రజలు ఉన్నారని, వారి మద్దతుతో బరిలో నిలిచినట్లు తెలిపారు. దీంతో గ్రామంలో ఎన్నికల సందడి మొదలైంది.