హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం

TPT: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వినాయక స్వామి ఆలయం దాటిన తర్వాత మలుపు వద్ద ఆర్టీసీ బస్సును ఎడమవైపు నుంచి ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పింది. దీంతో వాహనదారుడు రోడ్డుపై నుంచి కిందపడ్డాడు. ఈ ఘటనలో తిరుపతికి చెందిన పునీత్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం తిరుపతిలోని రూయా ఆసుపత్రికి తరలించారు.