హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

13 ఏళ్ల బాలిక వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని చాకలి వీధిలో ఆదివారం జరుగుతున్న బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. 13 సంవత్సరాల వయస్సు గల బాలికకు అదే ప్రాంతానికి చెందిన మేనమామతో వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. వెంటనే ఉన్నతాధికారులు బాలిక నివాసానికి చేరుకుని వివాహాన్ని నిలిపివేశారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.