హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రం వద్ద పోలీసుల బందోబస్తు

KDP: అట్లూరు మండలం వేమలూరు గ్రామ పంచాయతీ నామినేషన్ల స్వీకరణ కేంద్రం వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణయ్య, అట్లూరు ఎస్సై కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.