హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలో చేరిన స్వతంత్ర కౌన్సిలర్స్

పార్వతీపురం మున్సిపల్ ఎన్నికల్లో 10, 19వ వార్డుల నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించిన నేరేడువెల్లి శ్రీకాంత్, పోతల దుర్గాప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి సముచిత గుర్తింపు, గౌరవం కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.