CTR: శెట్టిపల్లి క్లస్టర్ పరిధిలోని స్వర్ణ భవనంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. శెట్టిపల్లి, కంచి బంధార్లపల్లి, పీబీవాడ, బెగ్గిలపల్లి గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల నుంచి ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ప్రక్రియ ప్రారంభం కావడంతో నామినేషన్ కేంద్రానికి అభ్యర్థులు, ఆశావహులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
స్వర్ణ భవనంలో నామినేషన్ల సందడి


