హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీబీఐ అధికారులమంటూ కిడ్నాప్

అన్నమయ్య: మదనపల్లెలో సీబీఐ అధికారులమంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి సాదిక్‌ను కిడ్నాప్ చేసి రూ.5 కోట్లు డిమాండ్ చేసిన కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ గుర్తింపు కార్డులు, తుపాకీతో బెదిరించి రూ.26 లక్షలు బదిలీ చేయించుకున్నారు. ఈ నెల 14న నిందితులను పట్టుకుని బాధితుడిని విడిపించారు. బదిలీ అయిన నగదును ఫ్రీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.