ATP: యాడికి పట్టణంలోని శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ఆదివారం స్పటిక లింగాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
స్పటిక లింగాన్ని ప్రత్యేకంగా అలంకరించిన అర్చకులు


