హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీఐ చట్టం అమలులో నిర్లక్ష్యంపై కాంగ్రెస్ ఆగ్రహం

ATP: సమాచార హక్కు చట్టం అమలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు ఇమామ్ ఆరోపించారు. ఆదివారం కొత్త పెన్షనర్ భవన్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ పాలనలో ఆర్టీఐ నిర్వీర్యమవుతోందని విమర్శించారు. అధికారులు స్పందించి, చట్టాన్ని పక్కాగా అమలు చేయకపోతే ప్రజాసంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.