TPT: తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక పుష్పయాగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం అంకురార్పణ నిర్వహించగా, సోమవారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారికి పుష్పయాగం జరగనుంది. ఇందుకోసం 8 టన్నుల పూలు, 18 రకాల పుష్పాలను సిద్ధం చేశారు. మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పవిత్ర పత్రాలతో స్వామివారికి పుష్పార్చన చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో రేపు వార్షిక పుష్పయాగం


