KRNL: కల్లూరు అర్బన్ 34వ వార్డు కృష్ణానగర్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు, జీవనోపాధి కోల్పోయిన అజయ్ కుమార్ కుటుంబాన్ని నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ MLA కాటసాని రామభూపాల్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. బాధితులకు మూడు బియ్యం బస్తాలతో పాటు వంట సామగ్రి, నిత్యావసర సరుకులు అందజేశారు. కుటుంబం అధైర్యపడవద్దని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
షార్ట్ సర్క్యూట్ బాధితులకు కాటసాని భరోసా


