ASR: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం, ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో జాతీయ గిరిజన గౌరవ దినోత్సవం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ కేశవరావు మాట్లాడుతూ గిరిజన హక్కుల పరిరక్షణకు బిర్సా ముండా చేసిన పోరాటం, త్యాగాలు యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గిరిజన గౌరవ దినోత్సవం


