హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి'

KRNL: ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆటో స్టాండ్ కార్మికుల సమావేశం సీఐటీయూ కార్యాలయంలో ఏ. సురేష్ అధ్యక్షతన జరిగింది. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, 50ఏళ్లు నిండిన వారికి నెలకు రూ.5 వేల పెన్షన్, పీఎఫ్, ప్రమాద బీమా కల్పించాలని సీఐటీయూ నాయకులు పి. గోవిందు, బి. రాముడు డిమాండ్ చేశారు. అనంతరం ఆటో స్టాండ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.