హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

27 పంచాయతీలకు 11 నామినేషన్ కేంద్రాలు: MPDO

కృష్ణా: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉంగుటూరు మండలంలోని 27 గ్రామ పంచాయతీలకు 11 నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో సత్య కుమార్ తెలిపారు. ఆముదాలపల్లి, ఆత్కూరు, ఇందుపల్లి, మానికొండ, నాగవరప్పాడు, నందమూరు, పెదఅవుటపల్లి, పొట్టిపాడు, తరిగొప్పుల, తేలప్రోలు, ఉంగుటూరులో కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.