హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులతో కలిసి సమయం గడపడం సంతోషంగా ఉంది: పల్లవి

ATP: అనంతపురం మార్కెట్ యార్డ్‌కు వచ్చిన రైతులకు అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి ఆదివారం స్వయంగా భోజనాలు వడ్డించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేస్తూ కొంతసేపు ఆత్మీయంగా గడిపారు. రైతుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. రైతులతో కలిసి సమయం గడపడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.