కాకినాడ: సామర్లకోట మండలం అచ్చంపేట, ఉండూరు, చంద్రంపాలెం నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును అదనపు SP (AR) ఎస్. శ్రీనివాసరావు పరిశీలించారు. డ్రోన్, CCTV, బాడీ వార్న్ కెమెరాలతో నిఘా ఉంచాలని ఆదేశించారు. 100 మీటర్ల నిబంధన, ఎన్నికల కోడ్ కఠినంగా అమలు చేయాలని, అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పరిశీలనలో ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: అదనపు SP


