హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నారాయణస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలం మిట్టపాలెంలోని ప్రముఖ నారాయణస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పొంగళ్లు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గోపూజ నిర్వహించారు. భక్తులకు ఆలయ ఈవో నరసింహబాబు వసతులు సమకూర్చారు.