హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైలవరంలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్

NTR: మైలవరం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీకి చెందిన ఎస్.వి.ఎన్. నివృతరావు ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో మైలవరం పట్టణం పసుపుమయంగా మారింది.