NRPT: శ్రీ సత్యనారాయణ చౌరస్తాలో ఆటో, జీప్ డ్రైవర్ల కోసం ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణ చైతన్య రోడ్డు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. చలికాలంలో పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగే ముప్పు ఉందని, వాహన లైట్లు సరిగ్గా ఉండేలా చూసుకోవాలన్నారు. పొగమంచు తీవ్రంగా ఉన్నప్పుడు అత్యవసరమైతేనే ప్రయాణించాలని, ఓవర్లోడింగ్ చేయకుండా పరిమిత ప్రయాణికులతోనే వెళ్లాలని సూచించారు.
తెలంగాణ
'రోడ్డు భద్రతా నియమాలు తప్పకుండా పాటించాలి'


