GDWL: ఐడీఓసీ మీటింగ్ హాల్లో రేపు సాధారణ ప్రజావాణితో పాటు పిల్లల కోసం ప్రత్యేక ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. బాలల హక్కులు, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, బాల కార్మికులు, బాల్యవివాహాలు, పాఠశాల సమస్యలపై 18 ఏళ్లలోపు పిల్లలు ఫిర్యాదులు అందజేయవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
తెలంగాణ
రేపు పిల్లల కోసం ప్రత్యేక ప్రజావాణి: కలెక్టర్


