HYD: ట్యాంక్‌బండ్‌పై భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి, బీజేపీ నేత జి.కిషన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉల్గులాన్ తిరుగుబాటుకు నాయకత్వం వహించి, ఆదివాసీల భూమి హక్కులు, సంస్కృతి పరిరక్షణకు పోరాడారని కొనియాడారు. స్వపరిపాలన కోసం ఆయన చేసిన పోరాటం భారత స్వాతంత్య్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
ట్యాంక్‌బండ్‌పై బిర్సా ముండాకు కిషన్ రెడ్డి నివాళులు


