హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం

NLG: యాసంగిలో వరి సాగుతో రైతులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నేడు, రేపు అధికారులు గ్రామాల్లో పర్యటించి ఆరుతడి పంటల సాగుపై రైతుల వివరాలు సేకరించనున్నారు. నల్గొండ జిల్లాలో ఇప్పటికే 14 వేల ఎకరాల్లో నూనెగింజల పంటలు సాగవుతున్నట్లు గుర్తించారు. తక్కువ నీటితో పండే పంటలు సాగు చేయాలని సూచించనున్నారు.