KMR: పిట్లం నుంచి కల్హేర్ వెళ్లే రహదారిపై అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రహదారికి ఇరువైపులా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. పనులు పూర్తయ్యే వరకు బైకులు, ఆటోలు, ట్రాక్టర్ల రాకపోకలకు అనుమతి లేదని సూచించారు. మరో వారం రోజుల్లో పనులు పూర్తవుతాయని, అనంతరం వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయని కాంట్రాక్టర్ ఇవాళ ఓ ప్రకటన లో తెలిపారు.
తెలంగాణ
వారం రోజుల పాటు రహదారి మూసివేత


