హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేగోడ్ మండలంలో 337 కొత్త పింఛన్లు మంజూరు

MDK: రేగోడ్ మండలంలో కొత్తగా 337 మందికి చేయూత పింఛన్లు మంజూరయ్యాయి. వీరిలో 232 మంది వితంతువులు, 67 మంది దివ్యాంగులు, 23 మంది ఒంటరి మహిళలు, 11 మంది అవివాహితులు, 4 మంది గీత కార్మికులు ఉన్నారు. రేగోడ్‌లో 55, లింగంపల్లిలో 35, గజ్వాడలో 31, ఇటిక్యాలలో 30 పింఛన్లు మంజూరు కావడంతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది.