NZతో జరుగుతున్న ఐదో వన్డేలో రో-కో జోడి మరోసారి నిరాశపరిచారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 34 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ (7), విరాట్ కోహ్లీ (5)లను ఫిషర్ పెవిలియన్కు పంపగా, రుతురాజ్ గైక్వాడ్ (18)ను డఫీ ఔట్ చేశాడు. ప్రస్తుతం 11 ఓవర్లలో 48/3తో ఉన్న భారత్ కోలుకోవాలంటే క్రీజులో ఉన్న శ్రేయస్, అక్షర్ భారీ భాగస్వామ్యం నెలకొల్పాల్సి ఉంది.
క్రీడలు
మరోసారి నిరాశపరిచిన రో-కో జోడి


