VKB: యాలాల్ నుంచి లక్ష్మీనారాయణపూర్కు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. రహదారిపై గుంతలు ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.
తెలంగాణ
యాలాల్–లక్ష్మీనారాయణపూర్ రహదారి అధ్వానం


