పంజాబ్ తరన్ తరన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తీర్థ యాత్రికులతో కూడిన రెండు బస్సులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వార్తలు
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి


