హైదరాబాద్: 28°C
వార్తలు

అలా జరిగితే డీలిమిటేషన్ బిల్లుకు సమ్మతమే: సుప్రియా

జనాభాతో ప్రమేయం లేకుండా ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లు పెంచితే డీలిమిటేషన్ బిల్లుపై ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్సీపీ ఎస్పీ నేత సుప్రియా సూలే ప్రకటించారు. మహారాష్ట్రలో పలు నియోజకవర్గాల్లో ఓట్ల సంఖ్య 40 లక్షలు దాటిందని.. అంతమందికి ఒకే ప్రతినిధి సేవలు ఎలా అందించగలరని ప్రశ్నించారు. ఎంపీ లాడ్స్ కింద ఇచ్చే రూ.5 కోట్ల నిధులతో 40 లక్షల మందికి ప్రయోజనం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.