హైదరాబాద్: 28°C
తెలంగాణ

జీవీ సేవలను అభినందించిన గవర్నర్

KMM: జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీకి నూతనంగా ఎన్నికైన డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు హైదరాబాద్ రాజభవన్‌లో ఛైర్మన్‌గా ప్రమాణం చేశారు. రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా కొల్లా రవీంద్ర కూడా ప్రమాణస్వీకారం చేశారు ఈ సందర్భంగా జీవీ చేపడుతున్న వైద్య సేవలను గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రశంసించారు. ప్రజలకు సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని సూచించారు.