హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

HNK: ఐనవోలు మండలంలోని పున్నేలు క్రాస్‌రోడ్డు వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని ఐనవోలు ఎస్సై అశోక్ శనివారం వెల్లడించారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.