U-19 ఆసియా కప్ టోర్నీలో వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 5 మ్యాచ్‌ల్లో కలిపి 361 పరుగులతో టోర్నీలోనే హైయస్ట్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ(160) ఉంది. ఈ అద్భుత ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇక ఫైనల్లో చేతికి గాయమైన నొప్పిని భరిస్తూ.. 58 పరుగులు చేసి అందరి మనసులు గెల్చుకున్నాడు.
క్రీడలు
'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'గా ఆర్యవీర్ సెహ్వాగ్


