హైదరాబాద్: 28°C
క్రీడలు

యువ భారత జట్టుకు మోదీ అభినందనలు

పురుషుల అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్‌పై అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు ప్రధాని మోదీ 'X' వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. నేడు భారత క్రికెట్‌కు అద్భుతమైన రోజని అన్నారు. యువ క్రికెటర్ల ప్రదర్శన పట్ల గర్వపడుతున్నానని పేర్కొన్నారు. వీరి విజయం ఎందరో యువతకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు. భవిష్యత్తులో జట్టు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.