హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అప్పు తీర్చలేదని పసికందు అపహరణ

TPT: తొట్టంబేడు మండలం శివనాథపాలెంలో అప్పు చెల్లించలేదనే నెపంతో ఆరు నెలల పసికందును ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. రూ.1.50 లక్షల అప్పు, ఐదు రూపాయల వడ్డీ వ్యవహారమే కారణమని ఆరోపణలు ఉన్నాయి. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టగా, నిందితులు భయపడి చిన్నారిని సురక్షితంగా వదిలేసి వెళ్లారు.