హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సత్యసాయి బాబా సేవలు చిరస్మరణీయం

అనకాపల్లి గవరపాలెం నిదానం దొడ్డిలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆలయంలో 101వ జయంతి వేడుకలకు శనివారం పతాకావిష్కరణతో శ్రీకారం చుట్టారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తితో వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు దాడి రత్నాకర్ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే సందేశాన్ని ఆచరణలో చూపిన మహనీయుడు సత్యసాయి బాబా అని కొనియాడారు.