కోనసీమ: అమలాపురంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అపరిశుభ్రత, నిర్లక్ష్యంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిన్న మూల నక్షత్రం సందర్భంగా నిర్వహించిన హోమం అనంతరం హోమగుండాన్ని తొలగించకపోవడమే కాకుండా, దాని చుట్టూ పాదరక్షలు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. పవిత్రమైన హోమం నిర్వహించిన ప్రదేశంలో పాదరక్షలు ఉండటంపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయంలో అపచారం.. హోమగుండం చుట్టూ పాదరక్షలు


