హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైఎస్ జగన్ కుటుంబంపై సైబర్ దాడి

VSP: మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై జరిగిన వ్యవస్థీకృత సైబర్ దాడి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. శనివారం విశాఖ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి డీసీపీ రామచంద్ర రావుకు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో నగర వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు, మొల్లి అప్పారావు పాల్గొన్నారు.