హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల నిర్వహణపై కార్యదర్శులతో సమీక్ష

కృష్ణా: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మోపిదేవి మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి జంగం స్వర్ణ భారతి గ్రామ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలంలో 13 గ్రామ పంచాయతీలలో 134 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సౌకర్యార్థం మంచినీరు, షామియానాలు సిద్ధం చేయాలన్నారు.