హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెదపాడులో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

ELR: పెదపాడు శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు, బాలల దినోత్సవం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో (ఎఫ్‌ఏసీ) బి. ఇందిరాగాంధీ మాట్లాడుతూ.. విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకుని పుస్తక పఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరారు.