హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి

PPM: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణ పిలుపునిచ్చారు. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా పార్వతీపురంలోని డీవీఎంఎం హైస్కూల్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అతిథిగా పాల్గొన్నారు. బాల్య వివాహాల వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.