హైదరాబాద్: 28°C
వ్యాపారం

1.24లక్షల మొబైల్ కనెక్షన్లు డిస్‌కనెక్ట్‌

స్పామ్ కాల్స్, నకిలీ మెసేజ్‌లకు చెక్ పెట్టేందుకు ట్రాయ్ చర్యలు చేపట్టింది. ఈ మేరకు నిబంధనలను ఉల్లంఘించినందుకు జులై-సెప్టెంబర్ మధ్య 1.24 లక్షలకు పైగా మొబైల్ కనెక్షన్‌లపై ఆంక్షలు విధించింది. అలాగే 374 సంస్థలను ఒక ఏడాది పాటు బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ త్రైమాసికంలో స్పామ్ కమ్యూనికేషన్లపై వచ్చిన 7.23 లక్షల ఫిర్యాదులపై చర్యలు తీసుకోనున్నట్లు చెప్పింది.