హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఓలాకు రూ.10 లక్షల జరిమానా

క్యాబ్ సేవలు అందించే ఓలాను నిర్వహిస్తున్న ANI టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనుచిత వాణిజ్య విధానాలపై కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికారసంస్థ (సీసీపీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రిప్ ప్రారంభానికి ముందే వినియోగదారుల నుంచి మోసపూరితంగా టిప్ వసూలు చేస్తున్నందుకు రూ.10 లక్షల జరిమానా విధించింది. కస్టమర్లను తప్పుదోవపట్టించే ఆ విధానాన్ని తక్షణమే ఉపసంహరించాలని ఆదేశాలు జారీ చేసింది.