మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం ఏర్పడడంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఫన్నీ పోస్టు చేశారు. అంతరాయంతో తొలుత తనకు ఆందోళన కలిగిందని చెప్పారు. ఆ తర్వాత నిరంతరం కనెక్ట్ అయి ఉండటం వల్ల కలిగే ఒత్తిడికి దూరంగా జీవితాన్ని గడిపేందుకు వీలు కలిగిందని తెలిపారు. కానీ మళ్లీ మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్ అందుబాటులోకి వచ్చాక విచారం కలిగిందంటూ ఫన్నీగా స్పందించారు.
వ్యాపారం
మైక్రోసాఫ్ట్ అంతరాయం.. ఆనంద్ మహీంద్రా ఫన్నీ పోస్టు


