మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, మాజీ ఎంపీ విఠల్‌రావు జయంతి వేడుకలను డీసీసీ అధ్యక్షుడు అంగంపల్లి సంజీవ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి, ప్రజలకు వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బెక్కరి మధుసూదన్ రెడ్డి, బెక్కరి అనిత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
నెహ్రూ, విఠల్‌రావు జయంతి వేడుకలు


