నిర్మల్ జిల్లా సోఫీనగర్ గురుకుల బాలికల పాఠశాల సమీపంలో కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన సీఎన్జీ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది.
తెలంగాణ
కారు నుంచి చెలరేగిన మంటలు


