హైదరాబాద్: 28°C
తెలంగాణ

అథ్లెటిక్స్‌లో ఎండపల్లి విద్యార్థుల ప్రతిభ

JGL: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఎండపల్లి జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు ప్రతిభ చాటారు. ఖమ్మంలో జరిగిన అండర్-17 హ్యామర్ త్రోలో సాయి సూరజ్ నాలుగో స్థానం సాధించగా, హనుమకొండలో జరిగిన అండర్-14 డిస్కస్ త్రోలో బి. కావ్యశ్రీ కాంస్య పతకం గెలుచుకుంది. విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.