హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైడ్రా పేరుతో పేదలపై వేధింపులు: ఈటల

MDCL: రాహుల్ గాంధీ దేశ ప్రతిష్ఠను దిగజార్చేలా మాట్లాడుతున్నారని MP ఈటల రాజేందర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారని మండిపడ్డారు. హైడ్రా పేరుతో పేదలను భయపెడుతూ, నోటీసులు లేకుండా ఇళ్లను కూల్చుతున్నారని ఆరోపించారు. మూసీ అభివృద్ధికి సరైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రేవంత్ పాలనతో కాంగ్రెస్ మరో 20 ఏళ్లు అధికారంలోకి రాదన్నారు.